దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ఇండియన్-2 చిత్రం తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన సంచలన చిత్రం ఇండియన్ కు సీక్వెల్ ఇది. ఇందులో అవినీతికి వ్యతిరేకం గా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్‌హాసన్ కనిపించనున్నారు. ఈ సందర్భంగా విడుద ల చేసిన పోస్టర్‌లో కమల్‌హాసన్ తెల్లటి ధోతి, కుర్తా ధరించి ఉన్నారు. చేతులకు సంకెళ్లు వేసి వున్నాయి. ఈ సీక్వెల్‌లో సేనాపతి అవినీతిపై చేసే పోరాటం సరికొత్త పంథాలో ఉంటుందని, చక్కటి సామాజిక సందేశంతో సినిమా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్నందిస్తున్నారు.