Skip to main content

Namaste NRI

అమెరికాలో భారత సంతతి రక్షణ వ్యూహకర్త యాష్లీ టెల్లిస్‌ అరెస్ట్‌!

అమెరికాలో భారత సంతతికి చెందిన విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ వ్యూహకర్త యాష్లీ జె టెల్లిస్‌ అరెస్ట్‌ అయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాల కేసులో ఫెడరల్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా ఆయన వద్ద ఉంచుకున్నారన్న ఆరోపణలు అదుపులోకి తీసుకున్నట్లుగా వర్జీనియా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం తెలిపింది. 64 ఏళ్ల ఆష్లే టెల్లిస్, వర్జీనియాలోని వియన్నాలోని తన ఇంట్లో దొరికిన వెయ్యి పేజీలకు పైగా అత్యంత రహస్య, రహస్య పత్రాలతో సహా జాతీయ రక్షణ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా దాచుకున్నాడని అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఆయన అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలిలో పనిచేశారు. ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు సలహాదారుగా, పెంటగాన్ ఆఫీస్ ఆఫ్ నెట్ అసెస్‌మెంట్‌తో కాంట్రాక్టర్‌గా జాబితా అయ్యారు. ఆయన వాషింగ్టన్ థింక్ ట్యాంక్ అయిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలో కూడా. టాటా చైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్‌గా యాష్లీ టెల్లిస్‌ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ రహస్య మెటీరియల్‌ నిర్వహణపై ఫెడరల్ దర్యాప్తు జరిపిన అనంతరం.. గత వారాంతంలో టెల్లిస్‌ను అరెస్ట్ చేసినట్లు ఫెడరల్‌ అధికారులు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News