Namaste NRI

రష్యాకు భారత్ సూచన… ఆ దేశంతో

ఉక్రెయిన్‌లో సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతున్నందున ఆ దేశంతో తిరిగి చర్చలు ప్రారంభించాలని రష్యాకు భారత్‌ మరోసారి సూచించింది. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్‌ యుద్ధం పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడిరది.  ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటిస్తోన్న భారత విదేశీవ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో మాస్కోలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చిస్తామని ఇరువురు నేతలు పేర్కొన్నారు.

          రష్యా నుంచి చమురు కొనుగోలుపై స్పందించిన జైశంకర్‌ తక్కువ ఆదాయ వనరులున్న భారత్‌ చౌక ధరలో లభ్యయమ్యే ఇంధన వనరులవైపు చూడక తప్పదన్నారు. ఈ క్రమంలో భారత్‌`రష్యాల బంధం తమకెంతో దోహదపడుతుందని, దీన్ని మున్ముందు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించడంతో పాటు ముడిచమురు సేకరణను పెంచుతామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events