దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. సైబర్ నేరాలపై పోరాటంలో భాగం గా బెంగళూరు పోలీసులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందజేసింది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టి గేషన్ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా రూ.33 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సీఎస్‌ఆర్ విభాగం వెల్లడిరచింది. ఈ మేరకు బెంగళూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చి( సీసీఐటీఆర్) సహకారాన్ని పునరుద్ధరించేం దుకు వీలుగా సీఐడీ, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( డీఎస్‌సీఐ) తో చేసుకున్న ఎంవోయూ పై సంతకాలు చేసినట్లు పేర్కొంది. సీసీఐటీఆర్ తో అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించడం ద్వారా సైబర్ నేరాల్లో దర్యాప్తు సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది.