పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన వకీల్‌సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ పింక్ రీమేక్‌గా తెరకెక్కించిన ఈ సినిమా భావోద్వేగభరితమై కోర్ట్ రూమ్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమా విడుదలై రెండేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ అభిమానులతో దర్శకుడు వేణుశ్రీరాం ముచ్చటించారు. అంతేకాదు వకీల్‌సాబ్ 2 కూడా ఉండబోతుందని సర్‌ప్రైజ్ వార్త అందించాడు. ప్రస్తుతం వకీల్‌సాబ్ 2 స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుందని చెప్పాడు. ఈ అప్‌డేట్ తెలుసుకున్న అభిమానులు పవన్ కల్యాణ్ కాంపౌండ్ నుంచి మరో బ్లాక్ బాస్టర్ రాబోతుందని ఎగిరిగంతేస్తున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్‌సాబ్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథాంశంతో చివరి వరకు రక్తికట్టించేలా సాగే వకీల్‌సాబ్‌కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన వకీల్‌సాబ్‌కు సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు, సుజిత్ దర్శకత్వంలో ఓజీ, సముద్రఖని డైరెక్షన్‌లో వినోదయ సీతమ్ రీమేక్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్. మరి ఇంత బిజీ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ 2కు డేట్స్ కేటాయించడం సాధ్యమవుతుందా..? ఇంతకీ ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.