Skip to main content

Namaste NRI

వేటా ఆధ్వర్యంలో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు

విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఆధ్వర్యంలో మార్చి 12న అమెరికాలోని డల్లాస్ నగరంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డల్లాస్ లో రుచి ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలలో ఆరు వందలకు పైగా తెలుగు ఆడపడుచులు మరియు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సిటీ మేయర్ నాన్సీ క్లైన్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి మహిళలు చేస్తున్న సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు ఝాన్సీ మాట్లాడుతూ యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా  స్త్రీలను గౌరవంగా చూసే చోట దేవతలు ఉంటారని, ఎక్కడ స్త్రీలను చిన్నచూపు చూస్తారో అక్కడ చేసిన పనులు వ్యర్థమవుతాయని చెబుతోందని అన్నారు. వేటా సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను వివరించారు. యాంకర్ మధు నెక్కంటి తన వాక్చాతుర్యంతో అందరితో ఆడుతు పాడుతు కార్యక్రమాన్ని ఎంతో రక్తికట్టించారు. వీటితో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనలు మరియు టాలీవుడ్, బాలీవుడ్ డ్యాన్స్‌తో కూడిన ఈవెంట్ భారీ ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని అలరించింది. ఆ తర్వాత రుచికరమైన ఆహారాన్ని అందించారు. ముఖ్యంగా మెహర్ చంటి గారి లైవ్ బ్యాండ్ వారు చేసిన సంగీత విభావరి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. ముఖ్యంగా మహిళలు చేసిన సంప్రదాయ వస్త్రాలతో చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలైట్ అని చెప్పవచ్చు. డా. సుమనా గంగి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వేటా  అధ్యక్షురాలు శైలజ రెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా సంస్థకు కృషి చేస్తే ఎంతో మంది మహిళలకు సేవ చేయగలం అని తెలిపారు.  పిదప అతిథి ఉపన్యాసకులు సంధ్య గవ్వ, శ్రీనివాస్ కవిత ఆకుల, సుమన గంగి, స్వాతి నేలభట్ల, నాగిని కొండేల, డా.శ్రీనివాస్ రెడ్డిలకు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డల్లాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నవ్యస్మృతి, ప్రతిమారెడ్డిలకు, కోర్ టీమ్ అనురాధ, హైమ అనుమాండ్ల, జయశ్రీ తేలుకుంట్ల, ప్రత్యూష నర్రపరాజు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు, వాలంటీర్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా ఈ కార్యక్రమానికి సహాయం అందించిన స్పాన్సర్లు కి, మీడియా మిత్రులకు, ఆహ్వానితులకు వేటా  నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events