Skip to main content

Namaste NRI

ఐర్లాండ్ అధికారిక కమిటీ ఏర్పాటు : మ‌హేశ్ బిగాల

బీఆర్ఎస్ ఎన్నారై విభాగంలో భాగంగా ఐర్లాండ్ అధికారిక కమిటీని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మ‌హేశ్ బిగాల ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 52 దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై సెల్‌లు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా, ఐర్లాండ్ 53వ దేశంగా బీఆర్ఎస్ ఎన్నారై విభాగంలో చేరింది. దీనికి సంబంధించి 2025–2027 సంవత్సరాల అధికారిక కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ ఐర్లాండ్‌లో బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా, స్థానిక కమ్యూనిటీలో తెలంగాణ సంస్కృతి, సేవా కార్యక్రమాలను విస్తృతంగా బలోపేతం చేయనుందని మహేష్ బిగాల తెలిపారు.

ఐర్లాండ్ కమిటీ సభ్యుల …..

అధ్యక్షుడు : కిరణ్ అనుగుర్తి
ఉపాధ్యక్షులు: విశాల్ శిరంశెట్టి, నితిష్ చిలువేరి
ప్రధాన కార్యదర్శి: పవన్ అనుగుర్తి
సలహా బోర్డు ఛైర్మన్లు: అజయ్ పొలంపల్లి, లింగమూర్తి
సలహా బోర్డు వైస్ ఛైర్మన్: ఉమేష్ చిప్ప
సలహా బోర్డు సభ్యులు: చాను బోయిని, సూర్య చందన్, నవీన్ కుమార్ కొండిజు
కార్యదర్శులు: రాకేష్ లెసాని, అన్వేష్ రెడ్డి, నోమాన్ సయ్యద్
ఐటీ, మీడియా, పీఆర్ కార్యదర్శి: సాయి మనీష్ తాటికొండ
ట్రెజరర్: ఉమేష్ చిప్ప, ప్రదీప్ గౌడ్
కమ్యూనిటీ వ్యవహారాల ఛైర్మన్: దినేష్ నంపల్లి
కమ్యూనిటీ వ్యవహారాల ఉపాధ్యక్షుడు: పవన్ కళ్యాణ్ చిర్రం
అధికార ప్రతినిధులు: రామకృష్ణ వేణిరెడ్డి, ఉమేష్ చిప్ప
సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లు: పవన్ అనుగుర్తి, దిలీప్ రెడ్డి గోపు
సభ్యత్వ కోఆర్డినేటర్: అభినవ్ గడ్డం

Social Share Spread Message

Latest News