
ప్రభాస్ ఫౌజీ సినిమా 2027, మార్చి 18న విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విడుదల చేసే ఫౌజీ గ్లింప్స్‌లో రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించనున్నారట. ఫౌజీ లాంటి పాన్ ఇండియా చిత్రం రిలీజ్‌కి మార్చి 18 సరైన డేట్ అని ఫిల్మ్ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 21 ఆదివారం వరకూ లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసొచ్చింది. అంతేకాదు, హోలీ పండుగ కారణంగా సెలవు కలిసొచ్చింది. మళ్లీ మార్చి 26న గుడ్ ప్రైడే. ఇవన్నీ ఫౌజీకి కలిసొచ్చే అంశాలు. అందుకే ఆ డేట్‌ని మేకర్స్ ఫిక్స్ చేసినట్టు వినికిడి. అయితే ఫౌజీ మార్చి 18న రాబోతున్న సందర్భంగా ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా స్పిరిట్ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి స్పిరిట్‌ని మార్చి 5న విడుదల చేయనున్నట్టు సందీప్‌రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఫౌజీ కారణంగా స్పిరిట్ ఏప్రిల్‌కి వెళ్లే అవకాశం ఉన్నదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.















