Skip to main content

Namaste NRI

అత్యధిక ఆస్కార్స్‌ అవార్డులు గెలుచుకున్న చిత్రమిదే

ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగాఎదురు చూసిన 95వ ఆస్కార్‌ వేడుకలు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఆస్కార్‌ వేడుకలో ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం-ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌వన్స్‌ , ఉత్తమ దర్శకుడు-డానియల్‌ క్వాన్, డానియల్‌ స్కీనెర్ట్, ఉత్తమ నటి-మిచెల్‌ యో, ఉత్తమ సహాయ నటుడు-కే హ్యూ క్వాన్‌, ఉత్తమ సహయ నటి-జామీ లీ కర్టిస్‌ ,ఉత్తమ స్క్రీన్‌ప్లే-డానియల్‌ క్వాన్, డానియల్‌ స్కీనెర్ట్, ఉత్తమ ఎడిటింగ్‌-పాల్‌ రోజర్‌ విభాగాల్లో అవార్డులను గెలిచి రికార్డు క్రియేట్‌ చేసింది.

Social Share Spread Message

Latest News