Namaste NRI

రూల్స్‌ రంజన్‌ రాకకు వేళాయే

కిరణ్‌ అబ్బవరం  కథానాయకుడిగా, నేహాశెట్టి కథానాయికగా నటిస్తున్న చిత్రం రూల్స్‌ రంజన్‌.  రత్నంకృష్ణ దర్శకత్వం. ఈ చిత్రాన్ని దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ పాటలు హిట్టయితే సినిమా దాదాపుగా సక్సెస్‌ అయినట్లే. ఈ చిత్రానికి అమ్రిష్‌ అద్భుతమైన సంగీతాన్నందించాడు. వినోదమే ప్రధాన బలంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. ఆద్యంతం చక్కటి వినోదంతో ఇంటిల్లిపాదిని అలరించే చిత్రమిదని దర్శకుడు రత్నంకృష్ణ తెలిపారు. వినోదాత్మక అంశాలతో పాటు కథలో కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ఈ సినిమాలో నేను మనోరంజన్‌ అనే పాత్ర పోషించాను. అతను మనలో ఒకడిగా ఉంటాడు. ఓ టౌన్‌ నుంచి నగరానికి వెళ్లిన అతను తన కాలేజీలో ఎలాంటి రూల్స్‌ తీసుకొచ్చాడు? ఈ క్రమంలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాలంటే రూల్స్‌ రంజన్‌ చూడాల్సిందే అన్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events