Skip to main content

Namaste NRI

వీలైనంత త్వరగా దీనిని.. కాంగ్రెస్‌ ఆమోదించాలి : జో బైడెన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దాడిని సైనిక చర్యగానూ, మాతృభూమి రక్షణ కోసం చేస్తున్న పోరాటంగా సమర్థించుకున్న సంగతి విదితమే. ఈ  నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు వ్యతిరేకంగా సమష్టి పోరాటానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి రెండో ప్రపంచ యుద్ధం నాటి లెండ్‌ అండ్‌ లీజ్‌ కార్యక్రమాన్ని మళ్లీ సచేతనం చేసింది. ఈ మేరకు బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకాలు చేశారు. దీంతో కీవ్‌, తూర్పు ఐరోపాదేశాలకు బలం లభించినట్లైందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన ఉక్రెయిన్‌ రష్యాతో పోరాడేందుకు 40 బిలియన్‌ డాలర్ల ఫ్యాకేజీను సిద్ధం చేసింది. ఇది బైడెన్‌ కోరిన 33 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ కంటే పెద్దది. యద్ద రంగంలో ఉక్రెయిన్‌ విజయం సాధించడానికి ఈ ప్యాకేజీ చాలా కీలకమైంది. ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ఉండాలనే కాంగ్రెస్‌ దీనిని ఆమోదించడం చాలా ముఖ్యం. ఇంకా పదిరోజులే గడువు ఉంది. కాంగ్రెస్‌ అనుమతి కోసం ఎదురుచూస్తే మా తదుపరి సాయం పంపడాన్ని ఆపలేము. కాంగ్రెస్‌ వీలైనంత త్వరగా దీనిని ఆమోదించాలని అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events