బినాన్స్ క్రిప్టో ఏజెన్సీపై దాడి చేసి హ్యాకర్లు సుమారు 6.3 బిలియన్ల డాలర్లు చోరీ చేసిన విషయం తెలిసిందే. ఆ చోరీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు ఉన్నట్లు క్రిప్టో నిపుణులు భావిస్తున్నారు. చోరీ చేసిన క్రిప్టోలతో ఉత్తరకొరియా తన ఆయుధ సంపదను పెంచుకుంటోందని సైబర్ సెక్యూర్టీ నిపుణులు చెప్పారు.

నార్త్ కొరియాకు చెందిన ట్రేడర్ ట్రైటర్ అనే గ్రూపు క్రిప్టో చోరీలకు పాల్పడినట్లు బ్లాక్చైయిన్ దర్యాప్తు కంపెనీ టీఆర్ఎం ల్యాబ్స్ పేర్కొన్నది. క్రిప్టోకరెన్సీ కంపెనీలలో ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఐటీ సిబ్బందిని మోసపూరిత సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు తేల్చారు. 2025 చివర వరకు ఉత్తర కొరియా హ్యాకర్లు సుమారు 6.75 బిలియన్ల డాలర్ల క్రిప్టోకరెన్సీని మాయం చేశారు.















