Namaste NRI

ఇద్దరు భారతీయులకు జాక్ పాట్… రాత్రికి రాత్రే

దుబాయ్‌లో ఇద్దరు భారతీయులకు లాటరీ రూపంలో అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. దుబాయ్‌ మహజూజ్‌ వీక్లీ డ్రాలో ఇద్దరు భారతీయులు జాక్‌పాట్‌ కొట్టారు. దీంతో చెరో 1 మిలియన్‌ దిర్హమ్స్‌ (రూ.2 కోట్ల 2 లక్షలు) గెలుచుకున్నారు. కేరళకు చెందిన దీప(50) తన ఫ్యామిలీతో కలిసి గత 18 ఏళ్లుగా యూఏఈలో నివాసముంటున్నారు. అక్కడి మార్కెట్‌ రిసెర్చ్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె క్రమం తప్పకుండా మహజూజ్‌ వీక్లీ లాటరీ టికెట్‌ కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ 18 ఏళ్లలో ఎప్పుడూ ఆమెకు లాటరీ తగిలింది లేదు. ఈ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ ఆమెకు అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. దీంతో దీప ఏకంగా రెండు కోట్లు గెలుచుకున్నారు. ఈ భారీ నగదులో కొంత మొత్తం స్వదేశంలో ఉన్న తన తల్లిదండ్రుల ఆస్పత్రి ఖర్చులకు వినియోగిస్తానని ఆమె అన్నారు. మరికొంత సొమ్మును తన పిల్లల చదువుకు ఖర్చు చేస్తానన్నారు. ఈ సందర్భంగా దీప ఆనందం వ్యక్తం చేశారు.

                ఇదే లాటరీలో జాక్‌పాట్‌ కొట్టిన మరో భారత వ్యక్తి పాండిచ్చేరికి చెందిన బరనిధరన్‌. గత పదేళ్లుగా యూఏఈలో ఉంటున్నారు. మహజూబ్‌ లాటరీ లాంచ్‌ చేసిన మొదటి రోజు నుంచి ఆయన ఇందులో పాల్గొంటున్నారు. తాజాగా 37వ వీక్లీ మహజూజ్‌ లాటరీలో బరనిధరన్‌కు జాక్‌పాట్‌ తగిలింది. ఆగస్టు 7న తీసిన డ్రాలో ఆయన 1 మిలియన్‌ దిర్హమ్స్‌ గెలుచుకున్నారు. తన లక్కీ నెం.07 అని, అదే నెంబర్‌తో కూడిన లాటరీ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Social Share Spread Message

Latest News