రవితేజ, హరీశ్‌శంకర్ కలిసి పనిచేస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్ తో సునాహోగా ఉపశీర్షిక. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో జగపతి బాబు కూడా భాగమయ్యారు. ఈ సినిమాలో ఆయనది అత్యంత శక్తిమంతమైన పాత్ర అని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జగపతిబాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చెస్ మూవ్‌ని చేతిలో పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న ఆయన లుక్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. రవితేజ, జగపతిబాబు కాంబినేషన్ కనుల పండువగా ఉంటుందని, ఇద్దరి పాత్రలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయని హరీశ్‌శంకర్ అన్నారు. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: మిక్కీ జె.మేకర్. నిర్మాత: టీజీ విశ్వప్రసాద్.