Skip to main content

Namaste NRI

జైలర్ హుకుం సాంగ్ లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ జైలర్‌. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తుండగా మోహన్‌లాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.  అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జైలర్ సెకండ్ సింగిల్ హుకుం పాటని మేకర్స్ ను విడుదల చేసారు. తెలుగు వెర్షన్ పాటను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు.  ప్రేక్షకులని ప్రతిసారి అలరించే అనిరుధ్ హుకుం పాట కోసం థంపింగ్ ట్యూన్‌ చేశారు. బీట్‌లు వోకల్స్ హైలీ ఎనర్జిటిక్ గా వున్నాయి. ఈ పాటకు భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించారు. రజనీకాంత్ పూర్తి మాస్ అవతార్‌లో తుపాకులు పేల్చుతూ కనిపించారు. రజనీకాంత్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్,  డైలాగ్ డెలివరీ ఖచ్చితంగా అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. విజయ్ కార్తీక్ కన్నన్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఆర్ నిర్మల్ ఎడిటర్. జైలర్ ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

Social Share Spread Message

Latest News