జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం మిలీ. తాజాగా ఈ సినిమాలో జాన్వీకి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్తో పాటు టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. మైనస్ 16 డిగ్రీల గడ్డకట్టుకు పోయే చలిలో ఇరుక్కుపోయిన జాన్వీ నోటిని ఉపయోగించి టేపులను చింపివేసే సన్నివేశంతో టీజర్ మొదలైంది. ఆమె టీజర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడం, ఆమెను బంధిచినట్లు కనిపించడం ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ఈ సినిమాకి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. బేవ్యూ ప్రాజెక్ట్స్ `జీ స్టూడియోస్ బ్యానర్లపై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. మనోజ్ పహ్వా, బిను పప్పు, అజు వర్గీస్, రోనీ డేవిడ్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.














