Skip to main content

Namaste NRI

అనకాపల్లి నుంచి జాతర సాంగ్ రిలీజ్

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న రా అండ్‌ రస్టిక్‌ థ్రిల్లర్‌ అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. కండ్రేగుల నాయుడుతో కలిసి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని జాతర గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. గణేశ్‌ సలాది రాసిన ఈ పాటను దేవ్‌జండ్‌ స్వరపరిచారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ, మంగ్లీ గాత్రం ఈ పాటకు హైలైట్‌. నిజంగా జాతర చూస్తున్న అనుభూతిని కలిగించేలా విజువల్స్‌ సాగాయి.

మాస్‌కి నచ్చే యాక్షన్‌, యూత్‌కి నచ్చే లవ్‌ ట్రాక్‌, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్‌ కలగలుపుగా ఈసినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. తారక్‌ పొన్నప్ప, త్రినాథరావు నక్కిన, ఇంద్రజ అబ్బర్‌, మహబూబ్‌ బాషా, శ్రీనివాస వడ్లమాని, కండ్రేగుల నాయుడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 5న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కథ, కథనం, నక్కిన త్రినాథరావు, మాటలు: ఉదయ్‌ భాగవతుల, కెమెరా: మాయా.వి, నిర్మాణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్‌, నక్కిన నెరేటివ్స్‌.


Social Share Spread Message

Latest News