Namaste NRI

చరిత్ర సృష్టించిన జిన్‌పింగ్‌.. మావో తర్వాత

 చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ చరిత్ర సృష్టించారు. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికై, ఆ ఘనత సాధించిన ఏకైక నాయకుడిగా అవతరించారు. కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావో జెండాగ్‌ కంటే ఎక్కువకాలం చైనాను పాలించిన నేతగా కూడా రికార్డు సృష్టింబోతున్నారు. జిన్‌పింగ్‌ను చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) జనరల్‌ సెక్రటరీగా పార్టీ స్టాండిరగ్‌ కమిటీ ఎన్నుకొన్నది. సీపీసీ అధినేతే చైనా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 20వ సీపీసీ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి.  పార్టీ సెంట్రల్‌ కమిటీని ఎన్నుకొన్నారు. 300 మంది ఉండే సెంట్రల్‌ కమిటీ పార్టీ పొలిటికల్‌ బ్యూరో సభ్యులుగా 25 మందిని ఎన్నుకొన్నది. ఆ వెంటనే అందులోంచి ఏడుగురిని పార్టీ పొలిటికల్‌ బ్యూరో సభ్యులుగా 25 మందిని ఎన్నుకొన్నది. ఆ వెంటనే అందులోంచి ఏడుగురిని స్టాండిరగ్‌ కమిటీలోకి ఎన్నుకున్నారు. ఆ ఏడుగురిలో నుంచి జిన్‌పింగ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నుకోవటం సాఫీగా సాగింది.  జిన్‌పింగ్‌ 2012 నుంచి చైనా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Social Share Spread Message

Latest News