Skip to main content

Namaste NRI

జో బైడెన్ మరో కీలక నిర్ణయం

తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరో షాకిచ్చింది. అల్లకల్లోలంగా మారిన ఆ దేశానికి అన్ని రకాల ఆయుధాల అమ్మకాలను నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్‌ పాలనా యంత్రాంగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌కు పెండిరగ్‌లో ఉన్న లేదా పంపిణీ చేయని ఆయుధాల బదిలీని సమీక్షిస్తున్నట్లు యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో రక్షణ కాంట్రాక్టర్లకు తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల నేపథ్యంలో,  ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, యునైటెడ్‌ స్టేట్స్‌ విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో వారి అనుకూలతను నిర్ణయించడానికి పెండిరగ్‌లో ఉన్న ఆయుధాల ఎగుమతి లైసెన్స్‌లు, ఇతర ఆమోదాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ సేల్స్‌ కంట్రోల్స్‌ సమీక్షిస్తున్నాయి అని ఉత్తర్వులు జారీ చేసింది.

Social Share Spread Message

Latest News