గణేష్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం కల్లు కాంపౌండ్ 1995. ప్రవీణ్ జెట్టి దర్శకుడు. బుర్రా మల్లేష్ గౌడ్, హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మీ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 1995లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఆసక్తికరంగా సాగే ఈ కథలో చక్కటి సందేశం కూడా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. కన్నడంలో కొన్ని సినిమాలు చేశానని, సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రకటన చూసి సంప్రదించగా హీరోగా అవకాశమిచ్చారని గణేష్ తెలిపారు. పోసాని కృష్ణమురళి, జీవా, ప్రవీణ్, గౌతంరాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆరె సందీప్, సంగీతం: సాయిశ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ జెట్టి.