
సముద్రఖని, అభిరామి ముఖ్య పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న మిస్టీరియస్ థ్రిల్లర్ కామాఖ్య. డివైన్ వైబ్‌తో కూడిన ఈ సినిమా పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. యూనిక్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నదని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రమేష్ కుశేందర్‌రెడ్డి, సంగీతం: గ్యాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్, ఆర్ట్ డైరెక్టర్: భూపతి యాదగిరి, స్టంట్స్: రాజేష్ లంక, కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి.
















