Skip to main content

Namaste NRI

తెలుగు హారర్ మూవీలో కంగనా రనౌత్

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ హారర్‌ చిత్రంలో నటిస్తున్నది. తెలుగు దర్శకుడు రవిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు స్కేరీ పిక్చర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్‌లో విభిన్న కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు, ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఢిల్లీలో నిర్వహించిన హారర్‌కాన్‌ ఇండియా 2026 కార్యక్రమంలో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని ప్రకటించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె హారర్‌ సినిమాలో భాగం కావడం విశేషం. ప్రయోగాత్మక కథలతో సినిమాలు తీసే రవిబాబు, కంగనారనౌత్‌ వంటి అగ్ర కథానాయికతో ఎలాంటి హారర్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం క్వీన్‌-2 సర్కిల్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉంది కంగనారనౌత్‌. మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events