కన్నడ దర్శక నటుడు, రచయిత రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం కాంతారా. నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 30న రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో కాంతారా సినినమాను ఇతర భాషల్లోకి కూడా అనువదించి, రిలీజ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ కాంతారా తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుని, గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ఒక ఊరిలో ఒక రాజు ఉండే వాడట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన ఊరివాళ్లకు ఇచ్చేశాడట. దైర్యం.. దైర్యం ఉండేది నీలో ఉన్న ఆవేశంలోనే కానీ నీలో ఉన్న ఆవేశం నీకు శత్రువు కాకూడదు అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్వప్, సంగీతం: అజనీష్ లోకనాథ్, నిర్మాత కిరగందూర్, దర్శకత్వం: రిషబ్ శెట్టి.














