Skip to main content

Namaste NRI

తానా వీల్ చైర్ క్రికెట్ పోటీలో … విన్నర్స్‌గా కర్ణాటక జట్టు

విశాఖపట్నం గీతం ఇంజనీరింగ్ కళాశాలలో గత నాలుగు రోజుల నుండి తానా నిర్వహిస్తున్న సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలలో విన్నర్స్‌గా కర్ణాటక జట్టు, రన్నర్స్‌గా తమిళనాడు జట్టు నిలిచింది. ముగింపు ఉత్సవానికి గీతం విశ్వవిద్యాలయం చైర్మన్ ఎం శ్రీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  ముఖ్య అతిథిలుగా  పాల్గొన్నారు. గీతం చైర్మన్ భరత్ మాట్లాడుతూ భవిష్యత్తులో తానా ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వచ్చే ఏడాది జాతీయస్థాయిలో వీల్ చైర్ పోటీలు నిర్వహిస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు.

 ఈ ముగింపు ఉత్సవానికి  తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా కార్యదర్శి వేమూరి సతీష్, చైతన్య స్రవంతి ఇంచార్జ్ సునీల్ పంత్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా కటికి తదితరులు హాజరయ్యారు. తానా తరపున క్రికెట్ పోటీలు నిర్వహించిన స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ యార్లగడ్డ శశాంక్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. విన్నర్స్, రన్నర్స్‌తో పాటు పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరికీ తానా నేతలు మెమెంటోలు అందజేశారు. 15 మూడు చక్రాల సైకిళ్లు, 100 దుప్పట్లు క్రీడాకారులకు అందజేశారు.

Social Share Spread Message

Latest News