కార్తి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జపాన్ . అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్ ఓ కీలకపాత్రని పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. కార్తి పాత్ర ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. త్వరలో తొలి షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవిశర్మన్, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: వినేష్ బంగ్లాన్, రచన` దర్శకత్వం : రాజు మురుగన్.














