Skip to main content

Namaste NRI

కశ్మీర్​ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే … ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్‌ కౌంటర్

పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా ఐక్యరాజ్యసమితి లో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత భాగం భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ విడదీయలేనిదని అన్నారు. దీనికి విరుద్ధంగా చేసే వాదనలకు చారిత్రక ఆధారాలు లేవని చెప్పారు. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార వాదనలు ఈ వాస్తవాన్ని మార్చలేవని అన్నారు. ఐరాస వేదికలను పాకిస్థాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

Social Share Spread Message

Latest News