చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దర్శకుడు బాబీ కొల్లి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో నటించే కథానాయికతో పాటు ఇతర తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.





























