Skip to main content

Namaste NRI

అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కిమ్ సోదరి

అమెరికా మిలిటరీ గూఢచారి విమానం తమ దేశంలోని ప్రత్యేక ఆర్థిక జోన్  లోకి ఎనిమిదిసార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్  సోదరి కిమ్ యో జోంగ్ ఆరోపించారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టినట్లు చెప్పారు. ఈ మేరకు అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు.  తమ గగనతలంలో అమెరికా నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆ విమానాలను కూల్చివేయొచ్చని హెచ్చరించారు. ‘మా దేశంలోని ప్రత్యేక ఆర్థిక జోన్ పై నిఘా విమానాలను ఎగురవేయడాన్ని కొనసాగిస్తే ఉత్తర కొరియా నిర్ణయాత్మక చర్య తీసుకుంటుంది అని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News