Skip to main content

Namaste NRI

ఫిలడెల్ఫియాలో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఫిలడెల్ఫియాలో చేపట్టిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచడంతో పాటు సాటి వారికి సాయం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌ను విద్యార్ధులు నడిపించారు. స్థానిక ది హిల్ స్కూల్ విద్యార్థి కాగితపు అఖిల్ దీనికి నేతృత్వం వహించాడు. నాట్స్ నాయకులతో కలిసి అఖిల్ అతని సహచర విద్యార్ధులు నిర్వహించిన ఈ ఫుడ్ డ్రైవ్‌కి చక్కటి స్పందన లభించింది.

నాట్స్ ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఆహారపదార్థాలతో పాటు 5వేల డాలర్లను పెన్విలినియాలోని చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్‌కు అందించడం జరిగింది. నాట్స్ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు నాట్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్ధుల్లో చిన్ననాటి నుంచే సేవ భావాన్ని పెంచేందుకు నాట్స్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. నాట్స్ అందిస్తున్న సాయం పేదల ఆకలి తీర్చేందుకు దోహదపడుతుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News