Namaste NRI

 కొరమీను ట్రైలర్‌ రిలీజ్‌ 

 విజయవాడలో నేరస్తులకు సింహ స్వప్నంగా ఉండే ఐపిఎస్‌ ఆఫీసర్‌ మీసాల రాజు ఆలియాస్‌ సీతారామరాజు విశాఖపట్నం సిటీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు అనే డైలాగ్‌తో కొరమీను ట్రైలర్‌ ఆరంభం అవుతుంది. ఈ డైలాగ్‌ వచ్చే సమయంలో మీసాల రాజుగా యాక్టర్‌ శత్రు ఇంట్రడక్షన్‌ ఇచ్చారు. విశాఖకు వచ్చిన  మీసాల రాజుకి మీసాలుండవు. అదే పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. సీతారామరాజుకి అదిపెద్ద సమస్యగా మారుతుంది. మరో వైపు విశాఖలో జాలరిపేటలో డ్రగ్స్‌ కు సంబంధించిన గొడవ జరుగుతుంటుంది. ఆ కేసుని మీసాల రాజు టేకప్‌ చేస్తారు. మరోవైపు జాలరి పేటలో డ్రగ్స్‌ కు సంబంధించిన గొడవ జరుగుతుంటుంది. ఆ కేసుని మీసాల రాజు టేకప్‌ చేస్తారు. మరోవైపు జాలరి పేటలో ఉండే డాన్‌ కరుణ ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. ఈ పాత్రలో హరీష్‌ ఉత్తమన్‌ కన్పించారు. అలాంటి కరుణాకి రైట్‌ హాండ్‌ కోటి.  పాత్రను మన కథానాయకుడు ఆనంద్‌  రవి పోషించారు. కరుణకి, కోటికి ఓ చిన్న గొడవ, కోటి మీనాక్షి ప్రేమికులు కోటీ ప్రేమ విషయం నచ్చని కరుణ అతనికి వారం రోజులు టైమ్‌ ఇచ్చి జాలరిపేటను విడిచి పోవాలని కండిషన్‌ పెడతాడు. కాగా ఆనంద్‌ రవి హీరోగా నటిస్తున్న కొరమీను చిత్రాన్ని మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో ఫుల్‌బాటిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమస్య రెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ మూవీ  ఈ నెల 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇపుడు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైన ట్రైలర్‌ సినిమాపై క్యూరియా సిటీని పెంచింది. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మహేశ్వర్‌ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌ 31న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయటానికి సన్నాహాలు చేస్తునా్నరు. 

Social Share Spread Message

Latest News