ప్రవాసుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ప్రైవేట్ రంగంలోని ఆర్థిక, టెక్నికల్ విభాగాల్లో పనిచేస్తున్న ప్రవాస ఉద్యోగుల సర్టిఫికేట్లను తనిఖీ చేస్తున్నట్లు గల్ఫ్ దేశం కువైత్ ప్రకటించింది. సుల్తానేట్ చట్టాల ప్రకారం ప్రవాసుల భద్రతను నిర్ధారించడానికి అధికార యంత్రాంగం నిరంతరం పని చేస్తుందని ఈ సందర్భంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ వెల్లడించింది. ఇక సోదాల్లో భాగంగా అకాడమిక్ సర్టిఫికేట్స్ చెల్లవని తేలిన వారిని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పీఎఏం తెలిపింది. మొదటి ఉప ప్రధాని ఆ దేశాల మేరకు అథారిటీ కార్మిక మార్కెట్ విధానాలను సులభతరం చేయడానికి కృషి చేస్తున్నట్లు అథారిటీ వెల్లడించింది. సుమారు 16వేల మంది ప్రవాసుల వర్క్ పర్మిట్లను ఇప్పటికే రద్దు చేసినట్లు, వారిపై తదుపరి చర్యలు ఉంటాయని ఇటీవల కొన్ని నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో తాజాగా అథారిటీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
















