Skip to main content

Namaste NRI

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ చిరంజీవి ట్రైలర్ రిలీజ్

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం చిరంజీవి. శుభసాయివెంకట్‌ దర్శకుడు. దీప్తి నడిమింటి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. భగవద్గీత శ్లోకంతో ట్రైలర్‌ మొదలైంది. కుడివైపు గుండె ఉండి, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హీరో, అతన్ని వెంటాడుతున్న ఓ గ్యాంగ్‌, హీరోని ప్రాణంకంటే మిన్నగా ప్రేమించే తల్లి, ప్రియురాలు.

మరోవైపు స్పైడర్‌మ్యాన్‌ గెటప్‌లో విలన్స్‌ని వెంటాడుతున్న ఓ వ్యక్తి, ఈ నేపథ్యంలో ట్రైలర్‌ సాగింది. వేటాడేది పులినైతే వేస్ట్‌ చేసే ప్రతి బుల్లెట్‌కూ ఒక వాల్యూ ఉంటుంది, వాడు చిరంజీవి చంపినా చావడు, చచ్చినా చావడు లాంటి డైలాగులు బాగున్నాయి. తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ భరత్‌, వైవా రాఘవ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, సంగీతం: శేఖర్‌చంద్ర.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events