మిత్రదేశమైన ఒమన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధి తెరిచే విషయంలో ఇరాన్‌తో ఒమన్ చేతులు కలిపితే ఒమన్‌పై కూడా బాంబు దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో ఒమన్ దూరంగా ఉండాలని సూచించారు. గల్ఫ్ సంక్షోభం కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఆ దేశం మూసేసింది. దీంతో ఒమన్ సహా పలు గల్ఫ్ దేశాలకు చెందిన చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో ఒమన్ సహా అనేక గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

అమెరికా కూడా హార్ముజ్ జలసంధిని దిగ్భందించింది. ఈ నేపథ్యంలో ఒమన్‌కు తీవ్ర నష్టం వస్తుండటంతో తన వైఖరిలో మార్పు వచ్చింది. అమెరికాతో కలిసి ఉండటం కంటే ఈ విషయంలో ఇరాన్‌తో సంధి చేసుకోవడం బెటర్ అని భావిస్తోంది. ఇందుకోసం ఇరాన్‌తో కలిసి హార్ముజ్ జలసంధిని తెరిచే అంశాన్ని పరిశీలిస్తోంది. జలసంధికి సంబంధించి ఒమన్ తీరం నుంచి ఎంట్రీ, హార్ముజ్ నుంచి ఎగ్జిట్ వంటి అంశాల్ని పరిశీలిస్తోంది. రెండు దేశాలు కలిసి ఇక్కడి నౌకా మార్గాన్ని నియంత్రించాలని చూస్తున్నాయి. అంటే, అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా ఇరాన్, ఒమన్ కలిసి హార్ముజ్ జలసంధిని నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఈ విషయం ఇంకా చర్చలు, ప్రతిపాదనల దశలోనే ఉంది. ఈ అంశమే ఇప్పుడు ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది.















