పరువు నష్టం దావా కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబై కోర్టు చివరి అవకాశం కల్పించింది. వచ్చే విచారణకు తప్పకుండా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అంధేరి మైట్రో పాలిటన్ మెజ్రిస్ట్రేట్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ గత నవంబర్‌లో కంగనపై పరువునష్టం దావా వేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ ఒకటికి వాయిదా వేసింది.
