Skip to main content

Namaste NRI

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. అమెరికాలో 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయన సంస్థలు అమెరికా వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి. అమెరికా నుంచి వెళ్లే లేదా అమెరికా రావలసిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభవడం కారణంగా రద్దు కానున్నాయని నివేదికలు వచ్చాయి. అయితే బుధవారం నాకు కేవలం 215 విమానాలు మాత్రమే రద్దయ్యాయి.  వీటిలో ఎమిరేట్స్‌, ఏఎన్‌ఏ, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలు ఉన్నాయి.  ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ప్రకటించింది. 3.7`3.98 గిగాహెర్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల  కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.

Social Share Spread Message

Latest News