హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం టుక్ టుక్. సుప్రీత్ సి కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని, ఆర్‌వైజీ పతాకాలపై రాహుల్ రెడ్డి, సాయివరుణ్, శ్రీరాములు రెడ్డి నిర్మించారు. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ముగ్గురు యువకులు ఒక ఆటో బొమ్మను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్య చిత్రమిది. కథలో ఆటోకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి అనే అంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. కథ, కథనాల పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది అన్నారు. సాన్వీ మేఘన, నిహోల్ కోదాటి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ సాయికుమార్, సంగీతం: సంతు ఓంకార్, దర్శకుడు: సుప్రీత్‌కృష్ణ.