Skip to main content

Namaste NRI

అమెరికాలో ఆ పెండ్లిళ్లకు చట్టబద్దత 

అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు ( సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌) చట్టరూపం దాల్చింది.  ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఆ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టంగా మారింది.  ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  మాట్లాడుతూ  ఇది చాలా సంతోషకరమైన రోజు అన్నారు. అమెరికా సమానత్వం దిశగా మరో అడుగు వేసింది. స్వేచ్ఛ, న్యాయం కొందరికే సొంతం కాదు. అందరికీ అనే దిశగా మరో నిర్ణయం తీసుకుంది.    మీలో చాలా మంది సౌత్‌ లాస్‌లో నిలబడి ఉన్నారు. నేను ఇప్పుడు సంతకం చేసిన చట్టం కోసం జరిగిన పోరాటంలో మీలో ఎందరో మీ బంధాలను వదులుకున్నారు. మీ ఉద్యోగాలను విడిచిపెట్టారు. మీ జీవితాలను ఫణంగా పెట్టారు అని   బైడెన్‌ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News