ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా వేణు మడికంటి తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం శాసనసభ, తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖయ పాత్రల్లో నటిస్తున్నారు. కీలక పాత్రలు పోఫిస్తున్నారు. ఈ సినిమాకి రవి బసూర్ స్వరాలందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నేపథ్య సంగీతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర నిర్మాణ షణ్ముగం మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. అందరికి నచ్చే కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాకి రవి బసూర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ సినిమా తప్పకుండా మా బ్యానర్ ప్రతిష్ఠను పెంచే విధంగా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు.














