Skip to main content

Namaste NRI

శాసనసభ ట్రైలర్‌ విడుదల 

 ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా వేణు మడికంటి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం శాసనసభ. తులసీరామ్‌ సాప్పని,  షణ్ముణం సాప్పని సంయుక్తంగా నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి రోజా, నిర్మాత  సతీష్‌ వేగేశ్న, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, దర్శకుడు చిన్నికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ ట్రైలర్‌ ప్రభావవంతంగా ఉంది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ మంచి పాత్ర పోషించారు. ఇంద్రసేనని చూసి, యష్‌ వచ్చాడేమో అనుకున్నా. ఆయన చక్కగా నటించారన్నారు. సినిమా విడుదలయ్యాక మా శాసనసభలో జరిగే దాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు అన్నారు దర్శకుడు వేణు. ఈ సినిమాకి సంగీతంతో పాటు ప్రాణం పోశారు రవి బస్రూర్‌ అన్నారు ఇంద్రసేన. ఈ సినిమా యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ అన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్‌ కుమార్‌. మంచి సబ్జెక్ట్‌, మంచి కమిట్‌మెంట్‌తో ఈ సినిమా తీశాం అన్నారు తులసీరామ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events