Skip to main content

Namaste NRI

లెహరాయి మోషన్‌ పోస్టర్‌

రంజిత్‌, సౌమ్యమీనన్‌, గగన్‌ విహారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లెహరాయి. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. అందమైన ప్రేమకథతో ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలు హృదయాన్ని స్న్పశిస్తాయి అన్నాయి  లెహరాయి అంటే అల ని అర్థం. సముద్రపు అలల మాదిరిగా జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయనే అంశాన్ని ఈ సినిమా చూపిస్తున్నాం. ప్రేమ, జీవిత లక్ష్యం మధ్య సంఘర్షణ ఎదుర్కొనే అమ్మాయి కథాగా తెరకెక్కిస్తున్నాం అని నిర్మాత తెలిపారు. కథ బాగా నచ్చడంతో తాను సినిమా సమర్పకుడిగా వ్యవహరించడానికి ముందుకొచ్చానని బెక్కెం వేణుగోపాల్‌ పేర్కొన్నారు. రావు రమేష్‌, నరేష్‌, అలీ, సత్యం రాజేష్‌, జబర్దస్త్‌ రాంప్రసాద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి, సంగీతం: జీకే, నిర్మాణ సంస్థ: ఎస్‌.ఎల్‌.ఎస్‌.మూవీస్‌, రచన`దర్శకత్వం: రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జి.కె.టిప్స్‌ సుప్రీం రాజు, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News