Skip to main content

Namaste NRI

లవ్‌ ఓ లవ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

పావిష్‌ నారాయణన్‌, నాగదుర్గ జంటగా నటించిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా లవ్‌ ఓ లవ్‌. మాగేశ్‌ రాజేంద్రన్‌ దర్శకుడు. జి.ధనంజేయన్‌, దినేష్‌రాజ్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. యువహీరో విశ్వక్‌సేన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించగా, ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్‌, దామోదరప్రసాద్‌, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాభినందనలు తెలిపారు.

తమిళ వెర్షన్‌కి సెన్సార్‌ పూర్తయిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈసినిమా నచ్చుతుందని నిర్మాతలు జి.ధనంజేయన్‌, దినేష్‌రాజ్‌ నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమా విజయం పట్ల దర్శకుడు మాగేశ్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా హీరో పావిష్‌ నారాయణన్‌, హీరోయిన్‌ నాగదుర్గ, నటి వనిత విజయ్‌కుమార్‌ కూడా మాట్లాడారు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events