Skip to main content

Namaste NRI

బాలయ్య విడుదల చేసిన లవ్‌ రెడ్డి టైటిల్‌

అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్‌ రెడ్డి.  తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను హీరో బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ అంతా కొత్త వాళ్లు కలిసి చేస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరారు. చిత్ర యూనిట్‌ సభ్యులకు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. కర్ణాటక లోని బాగేపల్లి మరియు చిక్కబల్లాపూర్‌ ప్రాంతంలో మరియు బెంగళూరులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరింబోతున్నారు. త్వరలో ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయబోతున్నారు. ఎమ్జీఆర్‌ ఫిలింస్‌, గీతన్‌ ప్రొడక్షన్స్‌, శహరి స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ చిత్రానికి స్మరణ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హేమలత రెడ్డి, మదన్‌ గోపాల్‌, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మాతలు.

Social Share Spread Message

Latest News