
అమరావతి నిర్మాణానికి ఎన్నారై లు సహకారం అందించాలని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. టిడిపి ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో నిర్వహించిన మహానాడు వేడుకలకు ఆయన హాజరయ్యారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపై తెచ్చిన ఘనత టిడిపిదే అన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఎన్నారై లు గతంలో అందించిన మద్దతు పార్టీకి, తెలుగు ప్రజలకు ఎంతో బలాన్ని ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది అని ప్రధాని మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పారు.





























