Skip to main content

Namaste NRI

మహేష్ కాంపెల్లి వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్ లాంచ్

మహేశ్‌ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వ్యూ: ది పాయింట్‌ ఆఫ్‌ వ్యూ. సత్య చౌదరి నిర్మాత. సోనియా నాయుడు, పూజారెడ్డి కథానాయికలు. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మహిళాప్రధాన చిత్రంలో అద్భుతమైన సందేశం కూడా ఉంటుందని, తొలి ప్రయత్నంలోనే ఇద్దరు కథానాయికల్ని పరిచయం చేయడం ఆనందంగా ఉందని నిర్మాత సత్య చౌదరి అన్నారు. దిశ ఘటనతోపాటు కొన్ని వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొంది, ఈ కథ రాసుకున్నానని దర్శకుడు మహేశ్‌ కాంపెల్లి తెలిపారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోయిన్లు సోనియా నాయుడు, పూజారెడ్డి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా అన్విధ్‌, సాగర్‌, సమీర్‌, రంగారావు చౌదరి, ముసా అలీఖాన్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events