ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరోనా బాధితులకు మహీంద్రా గ్రూప్ భారీ సహాయం ప్రకటించింది. కొవిడ్ బాధితులకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు రూ.4 కోట్ల విలువైన సాయాన్ని అందించనున్నది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు ఈ నిధులతో రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించనుంది. విశాఖపట్నంలో 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం, కర్నూలులో 1000 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నది. పశ్చిమ గోదావరి జిల్లాకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించనున్నదని నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు