అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాస ప్రాంతానికి సమీపంలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నేపథ్యంలో సమీప రహదారులను మూసివేశారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) వివరాల ప్రకారం లియర్‌జెట్ 60 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బహామాస్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఫ్లోరిడాలోని క్రెస్ట్‌హేవెన్ ప్రాంతంలో నేలపైకి దూసుకొచ్చి కూలిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన మార్-ఎ-లాగో నివాసానికి ఈ ప్రాంతం సుమారు తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదంపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ స్పందించారు. విమానం కూలిన దృశ్యాలు చూస్తే అది క్షిపణిలా కిందికి దూసుకొచ్చినట్లు ఉందని, భారీ పేలుడుతో శకలాలు అన్ని వైపులా ఎగిరిపడ్డాయని ఆయన పేర్కొన్నారు.















