అరణ్మనై సిరీస్ నుంచి రానున్న నాలుగవ చిత్రం అరణ్మనై 4. ఈ చిత్రం బాక్ పేరుతో మే 3న తెలుగులో విడుదల కానుంది. సుందర్.సి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశీఖన్నా కథానాయికలు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్‌కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నా, కోవై సరళ హాజరయ్యారు. ఇందులో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. వినోదమే ప్రధానంగా రూపొందిన చిత్రం బాక్. కుటుంబప్రేక్షకులను కూడా నచ్చే సినిమా ఇది. చిన్నపిల్లల నుంచి మహిళల వరకూ అందరినీ అలరించిన సిరీస్ అరణ్మనై. ఈ సినిమాతో మరో సూపర్‌హిట్ ఇవ్వనున్న మా దర్శకుడు సుందర్.సికి థ్యాంక్స్. దర్శకుడు చెప్పింది అర్థం చేసుకొని నటించే ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉండేదని ఈ స్క్రిప్ట్ రీసెర్చ్‌లో సుందర్ తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథేంటి? తనేం చేసింది? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అని ఖుష్బు సుందర్ చెప్పారు.