మమ్ముట్టి హీరో నటిస్తున్న చిత్రం టర్బో. వైశాక్ ఫిల్మ్ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రానికి మిధున్ మాన్యుయెల్ థామస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మమ్ముట్టి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ లాంఛ్ చేయగా, మమ్ముట్టి షార్ట్ హెయిర్, కోరమీసాలతో ఉన్న మమ్ముట్టి బ్లాక్ షర్ట్, తెలుపు లుంగీలో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తూనే, మరో వైపు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించి అభిమానులు, మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. టర్బో జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశాడు.