ఆస్ట్రేలియాలో జరిగిన నలభీముల పోటీల్లో ప్రవాస భారతీయుడు విజేతగా నిలిచారు. జస్టిస్ నారాయణ్ సీజన్`13 మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా టైటిల్‌తో పాటు రూ.1.86 కోట్ల నగదు బహుమతి గెలుచుకున్నారు. భారత సంతతి వారిలో శశి చెల్లయ్య తర్వాత ఈ టైటిల్ సాధించిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు. పెర్త్‌లో నివసిస్తున్న నారాయణ్, భారత్, పిజీ మూలాలున్నవారు. పికిల్ సలాడ్, ప్లాట్‌బ్రెడ్, చికెన్‌కర్రీ, చేపల కూర వంటి కొన్ని భారత వంటకాలతో న్యాయనిర్ణేతల జిహ్వలను ఔరా అనిపించారు. భారత, బెంగాలీ, రుచులను న్యాయనిర్ణేతల ముందుంచిన మరో ప్రవాసీ కిశ్వర్ చౌదరి, పీటే కాంప్‌బెల్‌లు తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. ప్రముఖ చెఫ్ దీపీందర్ చిబ్బర్ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు.