Skip to main content

Namaste NRI

మంత్రి కెటిఆర్ తో మీట్ అండ్ గ్రీట్

తెలంగాణ రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి సాధిస్తున్నదని, ఈ నిరంతర రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రవాస భారతీయులకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్  విజ్ఞప్తి చేశారు. స్విట్జర్లాండ్‌లోనే దావోస్‌లో నేటి నుంచి ప్రారంభం కానున్న‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి ఆయ‌న ఆదివారం దావోస్‌ చేరుకున్నారు. అక్క‌డ ప్ర‌వాస భార‌తీయులు ఆయ‌న‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.ప‌ర్య‌ట‌న‌లోభాగంగా సోమ‌వారం ఉద‌యం ఆయ‌న ప్ర‌వాస భారతీయుల‌తో భేటి అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు..వంద‌లాది మంది ప్ర‌వాసీలు పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో కెటిఆర్ ప్ర‌సంగిస్తూ, తెలంగాణ అభివృద్ది గురించి వివ‌రించారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సాధించిన పురోగ‌తి గురించి, పెట్టుబ‌డుల అవ‌కాశాల గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌వాస భార‌తీయులు ఇచ్చే మ‌ద్ద‌తు గొప్ప‌గా ఉంటుందని అన్నారు. అంతేకాదు తెలంగాణ ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌చారం చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు వ‌చ్చేందుకు కృషి చేయాలి అని ఆయ‌న కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events